సిద్దిపేటలోని రైతుబజారులో హరేరామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘భోజనామృతం’ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

సిద్దిపేటలోని రైతుబజారులో హరేరామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘భోజనామృతం’ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలోని రైతుబజారులో హరేరామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘భోజనామృతం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 రూపాయలకే భోజనం అందించనున్నారు. ‘భోజనామృతం’లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు మాత్రమే వాడనున్నారు. మంత్రి.. రైతులకు స్వయంగా భోజనం వడ్డించారు. అంతకు ముందు మంత్రి హరీష్‌ రావు.. రైతులతో మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా.. అని మహిళా రైతులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏ పంటలు ఏ సమయంలో పండించాలో తెలుసుకోవాలన్నారు. వేసవి సమయంలో కూరగాయలకు అధిక ధర ఉంటుంది గనుక ప్రణాళికా ప్రకారం పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. అప్పుడే రైతు.. రాజు అవుతాడని మంత్రి తెలిపారు. టమాట పంట శీతాకాలంలో పండుతుంది గనుక ఎక్కువ డిమాండ్‌ ఉంటుందనీ.. అందుకనుగుణంగా వేసవిలోనూ టమాట పంటను పండించాలన్నారు. అందుకు షెడ్డును వేసుకోవాలని మంత్రి సూచించారు. షెడ్డుకు అవసరమైన సహాయం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి.. రైతులకు భరోసా ఇచ్చారు. రైతు బజారును పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుతో పాటు ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు కరుణేంద్ర, కేతి నర్వరీ, భాస్కర్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Post Top Ad