తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అవమానించిన మంత్రి కేటీఆర్ సిబ్బంది - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 02, 2020

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అవమానించిన మంత్రి కేటీఆర్ సిబ్బంది

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సందర్భంలో సెక్యురిటీ సిబ్బంది ప్రవర్తనతో ఆయన అసహనానికి లోనయ్యారు. పొంగులేటి కుమారుడి వేడుకకు మంత్రి కేటీఆర్‌‌ కూడా హాజరయ్యారు. ఈయనతో పాటు పువ్వాడ అజయ్, ఇతర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బంది కాస్త అతి చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడను అడ్డుకున్నారు. పెళ్లిలో అందరి ముందు తనను సెక్యూరిటీ అడ్డుకోవడంతో మంత్రి కాస్త అసహనానికి లోనయ్యారు. తర్వాత అక్కడే ఉన్న పోలీసులపై ఫైర్ అయ్యారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )