రేపే అసెంబ్లీ లో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక శాఖ మంత్రి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

రేపే అసెంబ్లీ లో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక శాఖ మంత్రి


తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రేపు ఉదయం 11: 30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రిగా హరీష్‌రావు తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. రేపటి బడ్జెట్‌ నేపథ్యంలో రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 6న ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టి ఆమోదం తెలిపారు.

Post Top Ad