హరీశ్ రావు బడ్జెట్ ని కొనియాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ : సమతుల్యంగా కేటాయింపులు ఉన్నాయని కితాబు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 08, 2020

హరీశ్ రావు బడ్జెట్ ని కొనియాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ : సమతుల్యంగా కేటాయింపులు ఉన్నాయని కితాబు

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ అభినందించారు. 2020-21 సంవత్సరానికి ఆర్థిక శాఖ హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి సమతౌల్యంతో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు – తెలంగాణ ప్రజల అవసరాలకు మధ్య సమతౌల్యం సాధించిన వాస్తవిక బడ్జెట్ అని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం - అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయం అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాల వికాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని కితాబిచ్చారు.