భారత్ లో తొలి కరోనా మృతి నమోదు : వెల్లడించిన ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 13, 2020

భారత్ లో తొలి కరోనా మృతి నమోదు : వెల్లడించిన ప్రభుత్వం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ భారత్‌ను సైతం వణికిస్తోంది. చైనాలోని వూహాన్ నగరం కేంద్రబిందువుగా బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. దీంతో చాలా దేశాల్లో అక్కడి ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇక ఈ రక్కసి హైదరాబాద్‌ను కూడా కొన్ని రోజుల క్రితం తాకింది. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతనికి వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కర్నాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఇక్కడే ఆ వ్యక్తి మృతి చెందాడు. కర్నాటకలోని కాలాబురగీకి చెందిన 76 ఏళ్ల మొహ్మద్ హుస్సేన్ సిద్దిఖీని బీదర్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపుడుతున్నాడని తెలుసుకున్న వైద్యులు కరోనావైరస్ పరీక్షల కోసం శాంపిల్స్ పంపగా అతనికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ను ఓ ఎమర్జెన్సీ గదిలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. మంగళవారం రోజున అతను మృతి చెందాడు. అయితే గురువారం రోజున తెలంగాణ వైద్యాధికారులు హుస్సేన్ మృతి చెందిన ప్రైవేట్ హాస్పిటల్‌కు చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఐసొలేషన్ వార్డులో అతనికి నర్సింగ్ కేర్ ఇచ్చిన నర్సును కూడా ప్రతిరోజు వైద్యులు పర్యవేక్షించాలని కోరారు. ప్రస్తుతం ఆ నర్సులో ఎలాంటి కరోనావైరస్ లక్షణాలు కనిపించడం లేదు. అయితే భవిష్యత్తులో సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరించారు.

Post Top Ad