శంషాబాద్ ఎయిర్ పోర్టులోని స్క్రీనింగ్ పరికరాలను పరిశీలించిన మంత్రి ఈటల - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని స్క్రీనింగ్ పరికరాలను పరిశీలించిన మంత్రి ఈటల

రాష్ట్ర వైద్య, అరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులోని స్క్రీనింగ్ పరికరాలను మంత్రి ఈటల పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రజలను వణికిస్తుండగంతో దాని ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్కానింగ్ చేయాలని అక్కడి అధికారులతో అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రోజూ 550 మంది వరకూ విదేశాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికి కరోనా స్కానింగ్ పరీక్షలు చెయ్యడం తప్పనిసరని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఎయిర్‌పోర్టులో నాలుగు ప్రధానదారులు ఉండగా.. వాటి దగ్గర డాక్టర్లు, నర్సులు, హెల్పర్లు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తిని స్కానింగ్ చేస్తారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్ళి, ‌అతనికి పూర్తిగా మాస్కులు వేసి వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు” అని మంత్రి అన్నారు.

Post Top Ad