తెలంగాణలో ప్రబలుతున్న కరోనా వైరస్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

తెలంగాణలో ప్రబలుతున్న కరోనా వైరస్

తెలంగాణలో మరో ఇద్దరు వ్యక్తులుకు  కరోనా వైరస్  ఉన్నట్లు కేంద్రం తెలిపింది . ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ధ్రువీకరించినట్లుగా ప్రెస్ ఇన్ఫర్‌మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటించింది. పీఐబీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాలను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించింది. తెలంగాణలో అధిక వైరల్ లోడ్ ఉన్న రెండు కేసులను గుర్తించినట్లుగా పీఐబీ పేర్కొంది. అంతేకాక, దేశంలో కొత్తగా నమోదైన కొవిడ్-19 కేసులను కూడా పీఐబీ ఆ ప్రకటనలో ప్రస్తావించింది.  అయితే, ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు అనుమానాలున్నాయని, వారి రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లుగా బుధవారం గాంధీ వైద్యులు చెప్పారు. వారి పరీక్షా ఫలితాలు అందగానే ప్రకటిస్తామని వెల్లడించారు. వీరిని గాంధీలోని కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు చెప్పారు.