పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 16, 2020

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానంపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానానికి ఆమోదం చేసింది . సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం (మార్చి 16) ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్.. సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలూ ఈ తీర్మానంపై మాట్లాడారు.సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లౌకిక, ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై తమ తమ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సీఏఏ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని సూచించారు.కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌) సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మొట్టమొదట సమర్థించింది తామేనని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.

Post Top Ad