రికార్డులు నెలకొల్పుతున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 03, 2020

రికార్డులు నెలకొల్పుతున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం గత రెండేళ్లలో మూడుసార్లు 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2017–18లో జాతీయ స్థాయిలో అత్యధిక పీఎల్‌ఎఫ్‌ కలిగిన అత్యుత్తమ 25 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఐదో స్థానాన్ని సాధించింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని చెరో 600 మెగావాట్ల రెండు యూనిట్లు విడివిడిగా 15 సార్లు 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించాయి. 2వ యూనిట్‌ 9 సార్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. 2017లో ఫిబ్రవరి, మే, నవంబర్, 2018లో జూలై, సెప్టెంబర్‌ అక్టోబర్, 2019లో జనవరి, ఫిబ్రవరి, 2020లో ఫిబ్రవరిలో రెండో యూనిట్‌ 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది.