సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మహిళా దినోత్సవ మరియు హోలీ వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 11, 2020

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మహిళా దినోత్సవ మరియు హోలీ వేడుకలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మహిళా దినోత్సవ మరియు హోలీ వేడుకలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా జరుపుకొనే ప్రపంచ దినోత్సవంగా ‘విమెన్స్ డే’ను అభివర్ణించారు. ఈ ఏడాది ‘Each for Equal’ అనే నినాదంతో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఇదే నినాదంతో ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను నిర్వహిస్తోందన్నారు. ‘ఐటీ కారిడార్‌లో అత్యధిక సంఖ్యలో మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. వారందరికీ షీ టీమ్స్ రక్షణ కల్పిస్తుంది. తల్లిదండ్రులు అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలి. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి’ అని సజ్జనార్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం అంటే కేవలం ఈ ఒక్కరోజే కాదన్నారు. డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బందికి సజ్జనార్ సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ సూచించారు. వృత్తిపరంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. ‘నేర్చుకోవడం అనేది జీవితంలో ఒక నిరంతర ప్రక్రియ కావాలి. ఏదైనా ఒక అంశంపై తమ ప్రత్యేకతను చాటాలి. 17 వెర్టికల్స్‌లో భాగంగా ఏదో ఒక వెర్టికల్ కింద మంచి పేరు సంపాదించాలి’ అని సజ్జనార్ అన్నారు.

Post Top Ad