తెరాస రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన తెరాస అధినేత కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 12, 2020

తెరాస రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన తెరాస అధినేత కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం :  టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధినేత,తెలంగాణ సీఎంకేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ సీనియర్ నేత కే కేశవరావుకు మరోసారి అవకాశం కల్పించగా.. మరో స్థానానికి మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ మార్చి 12 ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తమకు అవకాశం కల్పించినందుకు కేకే, సురేశ్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావుకు మరోసారి అవకాశం ఇవ్వడానికే కేసీఆర్ మొగ్గు చూపారు. గత అనుభవం, ఢిల్లీలో ఆయన సేవల దృష్ట్యా మరోసారి ఎంపీగా అవకాశం కల్పించారు. రాజ్యసభ టికెట్లు ఖరారైన నేపథ్యంలో.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కోటాలో 7 రాజ్యసభ స్థానాలుండగా.. ప్రస్తుతం 5 స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్‌ (కేవీపీ రామచంద్రరావు), మరొకటి టీడీపీ (గరికపాటి మోహన్‌రావు, ప్రస్తుతం ఈయన బీజేపీలో ఉన్నారు) ఖాతాలో ఉన్నాయి. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు ఏపీ జాబితాలో ఉండగా.. ఏపీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలంగాణ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఈవిధంగా కేటాయించారు. కేవీపీ, గరికపాటి, కేశవరావు పదవీ కాలం ఇటీవలే ముగిసింది.

Post Top Ad