బషీరాబాద్ లో దళితులపై దాడి : న్యాయం చేయాలనీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

బషీరాబాద్ లో దళితులపై దాడి : న్యాయం చేయాలనీ మంద కృష్ణ మాదిగ డిమాండ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి:  టిఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేపైలట్ రోహిత్ రెడ్డి సొంత గ్రామం ఇంద్ర చెడు  బషీరాబాద్ మండలంలో దళిత కులానికి చెందిన లక్ష్మి ఉష్నప్పల    పై ఎమ్మెల్యే బంధువులు విజయభాస్కర్ రెడ్డి వారి అనుచరులు చిన్నయ్య గౌడ్ దళితుల ఇళ్లపై దౌర్జన్యంగా దాడి చేసి కులం పేరుతో దూషించి తీవ్రంగా గాయాలు చేసారు . ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న  పరిస్థితి ఉంది.  నిన్న ఐదున్నర గంటలకు దళితుల ఇళ్లపై దాడిచేసి దౌర్జన్యం పెట్రోల్ పోసి ఇళ్లను తగల పెడతామంటూ దళితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పై బంధువుల పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది కెవిపిఎస్ ఎమ్మార్పీఎస్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ మాదిగ కృష్ణ మాదిగ రాములు సురేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంధువులు దౌర్జన్యాలను అరికట్టాలని దళితులకు రక్షణ కల్పించాలని ఇంద్ర చెడు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కెసిఆర్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా టిఆర్ఎస్ నాయకుల బంధువులు దళితుల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే తాండూరు నియోజకవర్గం డీఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తామని ఎస్పీ కలెక్టర్ కు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదుచేస్తామని హెచ్చరించడం జరిగింది

Post Top Ad