మారుతీ రావు ఆత్మహత్య : అనుమానాలు రేకెత్తిస్తున్న పలు ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

మారుతీ రావు ఆత్మహత్య : అనుమానాలు రేకెత్తిస్తున్న పలు .....

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు లో నిందితుడు మారుతీరావు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, కేసుల ఒత్తిడి కారణంగానే మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ లేఖలో ‘గిరిజా క్షమించు, అమృతా అమ్మదగ్గరికి రా’ అని రాసి ఉందని సీఐ చెప్పారు. మారుతీ రావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం ఆయన మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. మారుతీ రావు మృతదేహాన్ని కుటుంబసభ్యులు మిర్యాలగూడకు తరలించారు. సంచలనం సృష్టించిన మిర్యాలగూడ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీ రావు ఆదివారం (మార్చి 8) హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆర్యవైశ్యా భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించారు. భవనంలోని ఓ గదిలో మారుతీ రావు మంచంపై విగతజీవిగా పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యా, సహజ మరణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి, ఆత్మహత్యగా నిర్ధారించారు. మారుతీ రావు మరణవార్త విని ఆయన ఆయన భార్య గిరిజ బోరున విలపించారు. మారుతీ రావు మృతదేహాన్ని చూడగానే.. చేతులతో బాదుకుంటూ ఆమె గుండెలవిసేలా రోదించారు.

Post Top Ad