అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు......

కాప్రా సర్కిల్ ఏ.ఎస్.రావు నగర్ అణుపురం కమ్యూనిటీ హాలులో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఏ.ఎస్.రావు నగర్ కార్పొరేటర పావనిమణిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉషారాణి, కెనరా, ఎస్.బి.ఐ, లీడ్ బ్యాంక్ మేనేజర్లతో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో నేడు మహిళలు అన్నిరంగాల్లో విజయం సాధిస్తున్నారని, ప్రతీ ఒక్కరు మహిళా సాధికారతకోసం పాటు పడాలని కోరారు. మహిళల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, మహిళలు తమను తాము తక్కువ చేసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రతీ ఒక్కరు ముఖ్యంగా పురుషులు మహిళను గౌరవించి, వారు అన్నిరంగాల్లో రాణించేందుకు పాటుపడాలని కోరారు. సమస్య వచ్చినపుడు వెనుకడుగు వేయకుండా దైర్యంగా ముందడుగు వేసి ఎదుర్కోవాలన్నారు. స్త్రీలు ప్రశ్నించడం ప్రారంభిస్తేనే మార్పు మొదలవుతుందని, వివక్ష అనేది ఇంట్లోనే మొదలవుతుందని, ఇంట్లో సమానంగా చూస్తే సమాజంలో కూడా సమానత్వం మొదలవుతుందని అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ ఉపోద్ఘాటించారు. చదువుతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తేనే పిల్లలు దృడంగా ఎదుగుతారని తెలిపారు. ఆర్థిక స్వావలంబనవైపు నిరంతరం కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అలాగే అత్యంత దారుణ, దురదృష్ట సంఘటన దిశ అత్యాచార నింధితులను ఎన్ కౌంటర్ చేసి దేశంలో ఎక్కడాలేని విధంగా సరియైన శిక్ష విధించిందని హర్షం వ్యక్తం చేశారు.

Post Top Ad