కేటీఆర్ ఫ్లెక్సీ కి లక్ష రూపాయల జరిమానా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

కేటీఆర్ ఫ్లెక్సీ కి లక్ష రూపాయల జరిమానా

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్..చెప్పినా వినకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ శాఖ తరపున రూ.లక్ష జరిమానా విధిస్తున్నామని ఆదేశించారు. మున్సిపల్ ఛైర్మన్ నుంచి రూ.లక్ష జరిమానా వసూలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ జరిమానా ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు విధించడం విశేషం. పట్టణంలో అనవసరంగా తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇల్లెందుకు వెళ్లినప్పుడు బహిరంగ వేదికపై మాట్లాడుతూ మంత్రి ఈ జరిమానా విధించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని చెప్పినా వినకుండా తన ఆదేశాలు బేఖాతరు చేశారని, అందుకే ఈ జరిమానా విధిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ భూతం ఎన్నో నష్టాలు తెస్తోందని చెప్పారు. రాజకీయ నాయకులు తమ ముఖాలు చూసుకోవడం తప్ప ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని హితవు పలికారు. ‘‘అయినా ఫ్లెక్సీలు పెడితే ఎవరూ లీడర్లు కారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలి. అంతేకానీ, ప్లెక్సీలు పెట్టుకొని లీడర్లు అవుదామంటే కష్టం.’’ అని కేటీఆర్ చెప్పారు.



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )