CAA, NPRలకు వ్యతిరేకంగా తెలంగాణ లో శాసన సభలో తీర్మానం జరిగే అవకాశాలు ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 06, 2020

CAA, NPRలకు వ్యతిరేకంగా తెలంగాణ లో శాసన సభలో తీర్మానం జరిగే అవకాశాలు .....


తెలంగాణ రాష్ట్రంలో  టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. రైతులకు అమలు చేసిన పథకాలను సభలోనే వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక పాలమూరు -రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సాగునీరు, వ్యవసాయరంగానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యతగా భావించి నిధులు కేటాయించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక CAA, NPRలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కంది రైతులు గత కోన్ని రోజులుగా రోడ్డేక్కి అందోళన చేస్తున్నా పట్టించుకోవట్లేదని విమర్శిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని వాటన్నింటి పై ఈ బడ్జెట్ సెషన్స్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకొని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయనుంది. అయితే ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అటు అధికార పార్టీ అశ్ర్రాలను సిద్ధం చేసుకుంటోంది. సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన అన్నీ పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad