హైదరాబాద్ భవిష్యత్తుని నాశనం చేస్తున్న GHMC: హై కోర్టుమందలించిన సరే పట్టనట్టే ఉన్న GHMC - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 12, 2020

హైదరాబాద్ భవిష్యత్తుని నాశనం చేస్తున్న GHMC: హై కోర్టుమందలించిన సరే పట్టనట్టే ఉన్న GHMC


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో  కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్‌ఎంసీ మాత్రం అస్సలు పట్టించుకోవట్లే , హై కోర్టుమందలించిన సరే పట్టనట్టే ఉంది రాజధాని భవిష్యత్తుని నాశనం చేస్తోంది  . అందుకే ఎనిమిది ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది. కేసులు పడ్డప్పుడు మూడు పరిశ్రమల నుంచే కాలుష్యం వెలువడుతోందని జీహెచ్‌ఎంసీ చెప్పింది. అనుమానం వచ్చి హైకోర్టు కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటే 345 పరిశ్రమల నుంచి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది. దీంతో జీహెచ్‌ఎంసీ కండ్లు తెరిచి 3 కాదు 198 పరిశ్రమల నుంచి కాలుష్య సమస్య ఉందని మరో అఫిడవిట్‌ వేసింది. 2012 నాటి పిల్స్‌పై అప్పుడే జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, కాలుష్య నియంత్రణ మండలి కలిసికట్టుగా పనిచేసుంటే 198 నుంచి 345కు పెరిగేవి కాదు. కాలుష్యం వల్ల జనం అల్లాడిపోతున్నారు. అయినా అధికారులకు పట్టడం లేదు.2016లో పొల్యూషన్‌ వల్ల సమస్యలున్న పరిశ్రమలపై చర్యలకు వీలుగా రాష్ట్ర సర్కార్‌ జీవో ఇస్తే దానిని అమలు చేయలేదని జీహెచ్‌ఎంసీ చెప్పడాన్ని ఎలా పరిగణించాలి ? అని ప్రశ్నించింది. ఆలస్యం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. 2012 నాటి కేసులో ఉన్న కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్రపోతున్నారా లేక కోమాలా ఉన్నారా అని ప్రశ్నించింది.

Post Top Ad