
కుత్బుల్లాపూర్ : HMT రిటైర్డ్ ఉద్యోగులు దీనావస్థలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా రాని గ్రాట్యుటీ, గత రెండేళ్లుగా రాని PF, దశాబ్ద కాలంగా రాని ఈ ఎల్ ఇంకాశమెంట్, రెండు దశాబ్దాలు గా రాని వేజ్ రివిజన్ ఎరియర్స్ ఎప్పుడెప్పుడా అని ఆశగా అర్రులు చాస్తూ జీవితాలను చాలించిన వాళ్ళు ఎందరో మరి అత్యవసరాలైనా మందులు, పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు డబ్బులందక అవమానభారం తో శ్వాస వదిలిన విశ్రాంత ఉద్యోగులెందరో. రిటైర్డ్ ఉద్యోగుల చట్టబద్ధ హక్కులంటే పట్టించుకోరు తమ చట్టబద్ధ బాధ్యతలను విస్మరిస్తారు. మేనేజ్మెంటుకు చీమైనా కుట్టినట్టు ఉండదు. అనేక చోట్ల పింజోరు, బెంగళూరు, మౌలాలి, హైదరాబాద్ లో గల వందల కోట్ల ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బులను చట్ట వ్యతిరేకంగా ఇతర ఖర్చులకు నిధులు మళ్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమూ నిధులివ్వలేదని వాపోతున్నారు అధికారులు. ఇటువంటి విశ్రాంత ఉద్యోగుల వ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనీ మార్చ్ 3వ తేదీన HMT మెషిన్ టూల్స్ కుత్బుల్లాపూర్ గేట్ వద్ద ధర్నానిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. వి.రామరావు కె. కర్ణపాలరెడ్డి ,రఘురామయ్య, సూర్యప్రకాష్ ,మజీద్, బలవంత రెడ్డి, జగత్ దాస్, నిరంజన్, దేవేందర్ మురళి. రావుల వరప్రసాద్ పూర్వ HMT, CITU నాయకులు పాల్గొన్నారు .