వరంగల్లోని NIT లో కరోనా వైరస్ : ఆందోళనలో వేలాదిమంది విద్యార్థులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 13, 2020

వరంగల్లోని NIT లో కరోనా వైరస్ : ఆందోళనలో వేలాదిమంది విద్యార్థులు


వరంగల్ జిల్లాలో కరోనా కలకలం . నిట్‌లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాజీపేటకు చెందిన ఓ యువకుడు...జ్వరం, గొంతు నొప్పితో బాధ పడుతూ..తమ ఆస్పత్రికి వచ్చాడని వెల్లడించారు. మార్చి నెలలో యూఎస్ నుంచి రిటర్న్ వచ్చినట్లు, అనంతరం కర్నూలుకు వెళ్లి..వచ్చినట్లు చెప్పాడన్నారు. కొద్ది రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పాడన్నారు. విదేశాల నుంచి రావడంతో కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో అతనికి చికిత్స చేయడం ఆరంభించినట్లు, ఇతని రక్తనమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపించాలా ? ఇతర విషయాలు తెలుసుకోవడానికి ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఇతర విద్యార్థులకు కరోనా లక్షణాలున్నాయని వచ్చాయనే సంగతి తమకు తెలియదని, అతను ఒక్కడే వచ్చాడని తెలిపారు.

Post Top Ad