జియో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన VoWiFi - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 02, 2020

జియో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన VoWiFi జియో తన వినియోగదారులకు VoWiFi ఫీచరును ప్రకటించింది. ఈ ఫీచరుతో Wi Fi ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ ఉచితంగా చేసుకునే వీలును కల్పిస్తోంది. అయితే, ఉచిత కాలింగ్ చేసుకోవడానికి అందరికి వీలుండదు. ఎందుకంటే, దీన్ని ఉపయోగించడానికి, VoWiFi ని ఆన్ చేసి WiFi నెట్ వర్క్ కి కనెక్టయ్యి ఉండాలి. ఈ సేవ భారతదేశంలోని అన్ని జియో చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో ఉపయోగించవచ్చు. ఈ VoWiFi కాలింగ్ ఉపయోగించడం కోసం, వినియోగదారులకు దీనికి అనుకూలమైన ఫోన్ మరియు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అవసరం. ప్రస్తుతం, ఈ VoWiFi సర్వీస్ 150 హ్యాండ్ సెట్లల్లో పనిచేస్తునట్లు జియో తెలిపింది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )