మేడ్చల్ జిల్లా లోని మౌలాలి లో కంటైన్మెంట్ జోన్ నీ తొలగించిన జిహెచ్ఎంసి,పోలీస్ అధికారులు... . - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

మేడ్చల్ జిల్లా లోని మౌలాలి లో కంటైన్మెంట్ జోన్ నీ తొలగించిన జిహెచ్ఎంసి,పోలీస్ అధికారులు... .

                   
శుభ తెలంగాణ:మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిహెచ్ఎంసి సర్కిల్ మౌలాలి  ప్రాంతంలో 04 ఏప్రిల్20 న  మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వారిలో ముగ్గురికి కొరోనా పాజిటివ్ గా  గుర్తుంచిన అధికారులు షఫి నగర్,షాదుల్లా నగర్,జవహర్ నగర్ కాలనీలను రేండు కంటైనమెంట్ జోన్లు గా ప్రకటించారు. అయితే కొరోనా వచ్చిన వారి కి వ్యాధి తగ్గి గాంధి నుంచి డిస్చార్ అవ్వడంతో ఇంకా ఎవ్వరికి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో మౌలాలి లోని షఫి నగర్, షదుల్లా నగర్ లో కంటైన్మెంట్ జోన్ ని శనివారం జిహెచ్ఎంసి,పోలీస్ అధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి మాట్లాడుతూ.. గత 20రోజు గా హెల్త్ వర్కర్స్ డోర్ టు డోర్ కంటోన్మెంట్ జోన్ మొత్తం విజిట్ చేసి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా అని తెలుసుకొని ఉన్నత అధికారులకు రిపోర్ట్ చేసేవారని.అలాగే అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు పొందేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా 8 మంది వాలంటీర్లను నియమించామని అన్నారు.కంటైన్మెంట్ లో ఉన్న 250 కుటుంబాలు కు ఎటువంటి సమస్య రాకుండా "ఇంటర్ డిసిప్లినరీ టీం" ఏర్పాటు చేశామని.
ఈ టీమ్ లో సభ్యులు గా మల్కాజ్గిరి జిహెచ్ఎంసి  డిప్యూటీ కమిషనర్ దశరథ్,మల్కాజ్గిరి పోలీస్           ఇన్స్పెక్టర్ మన్మోహన్,వైద్య అధికారి రెడ్డి కుమారి ఉన్నారని పేర్కొన్నారు.
                   
కరోనా వైరస్ నీ అరికట్టేందుకు ప్రాణాలుసైతం లెక్క చేయకుండా వైద్యఆరోగ్య,పోలీసులు,పారిశుద్ధ్యసిబ్బంది విధులు నిర్వహించారని తెలియజేశారు.


అనంతరం కంటైన్మెంట్ జోన్ లోపని చేసిన జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు,కూరగాయలు,శానిటైజర్ లు మరియు మాస్కులు పోలీస్ శాఖ నుండి పంపిణీ చేసి వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మల్కాజ్గిరి డి.సి.పి రక్షిత మూర్తి.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ దశరథ్,ఎసిపి వై.నరసింహా రెడ్డి ,ఇన్స్పెక్టర్ మన్మోహన్, వైద్య అధికారి రెడ్డి కుమారి ఇతర సిబ్బంది పాల్గొన్నారు..