సౌదీ అరేబియాలో కరోన దాటికి 11 చేరిన భారతీయ మృతులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

సౌదీ అరేబియాలో కరోన దాటికి 11 చేరిన భారతీయ మృతులు


సౌదీ అరేబియా : 
కరోనా మహమ్మారి కారణంగా పదకొండు మంది భారతీయులు సౌదీ అరేబియాలో ప్రాణాలు విడిచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 22 వ తేదీన కరోనా సోకి 11 మంది భారతీయులు మరణించారు. వీరిలో ఇద్దరు జెడ్డాలో మరణించగా.. ముగ్గురు మక్కాలో.. ఒకరు రియాద్‌లో మరొకరు దమ్మంలో మరణించారు. ఈ విషయాన్ని సౌదీలోని ఇండియన్‌ ఎంబసీ కూడా ధృవీకరించింది. ఇక్కడ ఉన్న భారతీయులు ఎవరు కూడా భయపడవద్దని.. ఇక్కడ ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఈ మహమ్మారికి రంగు, కులం, మతం, భాష, ప్రాంతం ఉండదని మోదీ చెప్పిన విషయాన్ని ఎంబసీ అధికారులు అక్కడి భారతీయులకు గుర్తు చేశారు. కరోనాపై వచ్చే వదంతులకు దూరంగా ఉండాలని సూచించారు.