తెలంగాణ విద్యార్థులకి శుభవార్త : మే 11 వరకు పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

తెలంగాణ విద్యార్థులకి శుభవార్త : మే 11 వరకు పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

4
హైదరాబాద్: కరోనా దాటికి విద్యావ్యవస్థ స్తంభించి పోయింది . అన్నీ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి . వీటిలో పాలిసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, దాన్ని మే 9 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి మూర్తి ప్రకటించారు. లాటరల్‌ ఎంట్రి ఇన్‌ టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎల్పీసెట్‌) దరఖాస్తుల గడువు మే 11 వరకు పొడిగించామన్నారు. టీఎస్‌ఎంసెట్‌ కోసం బుధవారం వరకు 1,92,162 దరఖాస్తులు వచ్చాయని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు మే ఐదు వరకు గడువు ఉన్నదని వెల్లడించారు. లాక్‌డౌన్‌లో దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం ఉన్నదని తెలిపారు.10 వ తరగతి విద్యార్థులకి శుభవార్త అన్నట్టే ఇది , పది అయ్యాక పాలీసెట్ రాసి పాలిటెక్నిక్ కి అర్హత పొందుతారు . ఇలా మరో అవకాశం విద్యార్థులకి వచ్చింది .