యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం లోని జులూర్ గ్రామం లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం లోని జులూర్ గ్రామం లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు...

శుభతెలంగాణ(14ఏప్రిల్ 20) యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం లోని జులూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ యాకరి రేణుక నర్సింగ్ రావు గారి స్వగృహం నందు డా.బి.ఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం జులూర్ గ్రామ సర్పంచ్ యాకరి రేణుక నర్సింగ్ రావు మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించడంతో అంబేద్కర్ జయంతి వేడుకలు స్వగృహంలో జరుపుకోవడం జరిగింది అని తెలిపారు.అంబేద్కర్ ప్రపంచ స్థాయి మేధావి అని కొనియాడారు.అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారమే ప్రభుత్వ పాలన జరుగుతోందని అన్నారు.అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.దేశానికి విశేష సేవలు అందించిన అంబేద్కర్‌కు ఘనమైన నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad