"మానవ సేవే మాధవ సేవ" నిరుపేదలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ: హర హర పుత్ర సేవా సంఘం...... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

"మానవ సేవే మాధవ సేవ" నిరుపేదలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ: హర హర పుత్ర సేవా సంఘం......

శుభతెలంగాణ(14ఏప్రిల్20) హైదరాబాద్ లోని కాప్రా సర్కిల్ లో "హర హర పుత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో    400 మంది నిరు పేద ప్రజలకు నిత్యవసర సరుకులు కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సంఘం నిర్వాహకులు శ్రీ నాగరాజు గుప్తా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీ మణికంఠ    స్వామి(అయ్యప్ప స్వామి) జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించే వారిమని.అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అయ్యప్ప స్వామివారి జయంతి  వేడుకలు చేయలేకపోయామని. అయితే "మానవ సేవే మాధవ సేవ" అనే సంకల్ప దృక్పథంతో నిరుపేద ప్రజలను ఆదుకోవడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన సభ్యులు  అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నాగనూరి మహేష్, నల్ల శ్రీనివాస్, టి.ప్రభాకర్, సతీష్ రెడ్డి, జి. శివ, నాగనూరియాదగిరి, సైదులు, నాయుడు, తేజ, ప్రదీప్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు....

మరిన్ని చిత్రాలు :


                   Post Top Ad