వరంగల్ రూరల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క రోజే 15 డెలవరి కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

వరంగల్ రూరల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క రోజే 15 డెలవరి కేసులు

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) :  జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఒక్క రోజే 15 డెలవరి కేసులు చేసారు . ఇందులో 12 సిజేరియన్ ఆపరేషన్లు , 3 నార్మల్ డెలవరి చేశారు. ఈ సందర్భంగా సూపర్ డెంట్ నర్సింహస్వామి మాట్లాడుతూ సమిష్టిగా అందరం టీం  వర్క్ తో ముందుకు వెళ్లుతున్నాము అని, అందువల్లన ఈ ఆసుపత్రికి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్నారు. మునుముందు సైతం ఇంకా పేద ప్రజలకు సేవలు అందిస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సోమా శేఖర్, నరహరి, స్టాఫ్ నర్సులు దివ్య, సునంద, భాస్కర్, నాగరాణి
తదితరులు పాల్గొన్నారు.