భారత్ లో 15 వేల చెరువకి కరోనా కేసుల సంఖ్య - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

భారత్ లో 15 వేల చెరువకి కరోనా కేసుల సంఖ్య


భారత్ లో కరోనా విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడంలేదు. నానాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడమే అందుకు కారణం. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,793 కాగా, మరణాల సంఖ్య 488కి పెరిగింది. ఇప్పటివరకు 2014 మంది కోలుకున్నారని, దేశవ్యాప్తంగా 12,289 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అటు రాష్ట్రాల్లో కరోనా ధాటి కొనసాగుతోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,323గా నమోదైంది. ఇప్పటివరకు అక్కడ 201 మంది మరణించారు.

Post Top Ad