హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వల్ల రూ.2.34 లక్షల నష్టం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వల్ల రూ.2.34 లక్షల నష్టం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించడంతో అన్ని బ్యాంకులు ఆ ఆదేశాలను ఫాలో అవుతున్నాయి. తమ కస్టమర్లకు మారటోరియం ఆఫర్ చేస్తున్నాయి. మరి మీరు కూడా మూడు నెలలు మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటున్నారా? మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయాలనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బులు ఉన్నా మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే నష్టపోవడం తప్పదు. ఈ విషయాన్ని బ్యాంకులు నియమనిబంధనల్లో స్పష్టంగా వివరిస్తున్నాయి. కానీ కస్టమర్లు ఈ నియమనిబంధనల్ని పట్టించుకోకుండా మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఈ మారటోరియం కేవలం మూడు నెలల ఈఎంఐలను వాయిదా వేయడానికి మాత్రమే. అంటే మీరు ఇంకా 24 నెలలు లోన్ చెల్లించాల్సి ఉంటే ఈ మూడు నెలలు వాయిదా వేస్తే లోన్ టెన్యూర్ మరో మూడు నెలలు పెరుగుతుంది. ఔట్‌స్టాండింగ్‌పై అంటే మీరు చెల్లించాల్సిన అప్పుపై ఈ మూడు నెలలు వడ్డీ కట్టాల్సిందే. మారటోరియం నియమనిబంధనల్లో ఈ అంశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే మీకు ప్రతీ నెల వచ్చే ఆదాయం ఇప్పుడు కూడా వస్తే, కరోనా వైరస్ ప్రభావం మీ ఆర్థిక పరిస్థితులపై లేకపోతే ఈఎంఐలు చెల్లించడమే మంచిది. మారటోరియం ఆప్షన్ ఉంది కదా అని మీరు ఎంచుకుంటే నష్టపోవాల్సిందే.

Post Top Ad