దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1975 కరోనా కేసులు.. లక్డౌన్ కొనసాగుతున్న ఆగని కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1975 కరోనా కేసులు.. లక్డౌన్ కొనసాగుతున్న ఆగని కేసులు

శుభ తెలంగాణ (27,ఏప్రిల్ , 2020) - జాతీయం(న్యూ ఢిల్లీ )  భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ  పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1975 కరోనా కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 26,917కు చేరింది. ఇప్పటివరకు 5,914 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 826 మంది మరణించారు. ప్రస్తుతం 20,177 మంది కరోనా కారణంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.