శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - తెలంగాణ) : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ అన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు ప్రతీ కార్యకర్త ఖచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. కోవిడ్-19 ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందకుండా మరింత అప్రమత్తంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సత్యం గౌడ్ , సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ నిరుపేదలు, వలస కూలీలను ఆదుకోవాలని.. వారికి అండగా నిల్వలన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలో బస్తీలు, కాలనీలలో పేద కుటుంబాలకు బియ్యం , నిత్యవసర సరుకులు అందిస్తూ వారిలో మనోసైర్యాన్ని నింపుతునట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కరోనా వ్యాప్తిని నిరోధించడంతో పాటు, వైరస్ సోకిన రోగులకు విస్తృత స్థాయిలో సత్వర చికిత్సలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ బాధ్యతగా లాక్ డౌన్ నిబంధనలు ఆచరించి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Post Top Ad
Sunday, April 26, 2020
ఈ నెల 27న టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు...
Admin Details
Subha Telangana News