ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలకి చేరువలో కరోనా కేసులు : - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలకి చేరువలో కరోనా కేసులు :


అంతర్జాతీయం :  చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా మాత్రం కరోనాను జయించామంటూ ఏ చర్యలు తీసుకున్నారో వివరాలపై దాటవేస్తోంది. రెండు వారాల కిందటే చైనాలో అన్ని రకాల మార్కెట్లు తిరిగి ప్రారంభమయ్యాయి.కరోనా వైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా శనివారం రాత్రి వరకు 2,896,633 నమోదయ్యాయి. చికిత్స అనంతరం కోలుకుని దాదాపు 8,34,500 మంది కోలుకున్నారు. రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం 18.8 లక్షల మంది కోవిడ్19 చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే అమెరికాలో 33,911 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,38,140కి చేరుకుంది.  అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి కరోనా తీవ్రత ఉన్న దేశాలలో.. అమెరికాలో 9,38,072 కేసులు - 53,751 మరణాలు, స్పెయిన్ 2,23,759 కేసులు - 22,902 మరణాలు, ఇటలీ 1,95, 351 కేసులు - 26,384 మరణాలు, ఫ్రాన్స్ 161,644 కేసులు - 22,614 మరణాలు, జర్మనీ 1,56,513 కేసులు - 5,877 మరణాలు, బ్రిటన్ 1,49,569 కేసులు - 20,319 మరణాలు, టర్కీ 1,7,773 కేసులు - 2,706 మరణాలు చోటుచేసుకున్నాయి.