యువజన కాంగ్రెస్ ములుగు ఇంచార్జ్ అశ్విన్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు, మాస్క్ లు పంపిణి... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

యువజన కాంగ్రెస్ ములుగు ఇంచార్జ్ అశ్విన్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు, మాస్క్ లు పంపిణి...

శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) - వరంగల్ :  వరంగల్ లోని 47 డివిజన్ లో యువజన కాంగ్రెస్ ములుగు ఇంచార్జ్ అశ్విన్ రాథోడ్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు, మాస్క్ లను మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.సి.సి. సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక  సంపత్ యాదవ్, వరంగల్ వెస్ట్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట పవన్ తదితరులు పాల్గొన్నారు.