నల్గొండ జిల్లాలో భారీగా పెరుగుతున్న కోవిడ్ -19 పాజిటివ్ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

నల్గొండ జిల్లాలో భారీగా పెరుగుతున్న కోవిడ్ -19 పాజిటివ్ కేసులు

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020 - తెలంగాణ ప్రాంతీయం)  :  నల్గొండ జిల్లాలో కోవిడ్ -19  (కరోనా వైరస్)  పాజిటివ్ కేసులు నమోదు. నల్గొండ జిల్లాలో మొత్తం 214 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటీవ్ గా వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జరిగిన తబ్లీకి జమాత్ కి వెళ్లి  వచ్చిన వారి బంధువుల్లో 34 మంది నుంచి రెండ్రోజుల క్రితం సేకరించిన  నమూనాల ఫలితాలు ఆదివారం వచ్చాయి. అయితే  వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఫలితాలు వచ్చాయి. దీంతో అధికారులతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, నమూనాలను కరోనా పరీక్షలకుపంపిస్తున్నారు .  పలువురు విదేశీయులు కూడా జిల్లాలో నివసిస్తున్నారు వారిలో  నలుగురు మయన్మార్, యుగాండ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. జిల్లాకు చెందిన 12 మంది ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఏడుగురు అనుమానితులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు 9,122 మంది హోం క్వారంటైన్లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండల్ రావు తెలిపారు. ప్రస్తుతానికి జిల్లాలో కరోనా అనుమానితులు లేకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్ డౌన్ అమలు జరిగేలా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్పీ ఏవీ రంగనాథ్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు

Post Top Ad