తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.... 4 లక్షల విద్యార్థులకు ఫ్రీ కోర్సులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.... 4 లక్షల విద్యార్థులకు ఫ్రీ కోర్సులు

  
శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - హైదరాబాద్) :  ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు చెందిన టీసీఎస్ అయాన్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన కోర్సుల్ని టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ ద్వారా అందించనుంది. చదువుకుంటున్నవారు, చదువు పూర్తి చేసుకున్నవారు మంచి ఉద్యోగం పొందేందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకునేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. అంతేకాదు ఉపాధి  అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు, జాబ్ మార్కెట్లో పోటీపడటానికి ఈ స్కిల్స్ తోడ్పడతాయి.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి. టీసీఎస్ అయాన్ సంస్థ ఒప్పందం ద్వారా రూపొందించిన ఈ కోర్సులు తెలంగాణలోని ఉన్నత విద్య అందిస్తున్న 1500 సంస్థలకు చెందిన నాలుగు  లక్షల మంది విద్యార్థులకు ఉచితం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ లో ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా ఈ కోర్సుల్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ https://www.tsche.ac.in/ ఓపెన్ చేసి చూడొచ్చు .