నెల రోజుల్లో రూ.412 కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

నెల రోజుల్లో రూ.412 కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ

శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - జాతీయం ) :  కరోనా వైరస్ కారణంగా దేశమంతా నెల రోజుల నుండి లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో నగరాల నుండి చిన్నచిన్న గ్రామాల వరకు జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను తీర్చడం కోసం పోస్టల్  శాఖ బ్యాంకింగ్ రంగంలో ఒక విప్లవాన్నే సృష్టించింది. డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంలకు ప్రజలు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో బ్యాంకు అకౌంట్ తో సంబంధం లేకుండా స్థానిక పోస్ట్ ఆఫీస్ కి కాల్ చేసి నగదు ఇవ్వమని అడగవచ్చు, ఫోన్ చేసిన 20 నిమిషాల్లో పోస్టల్ శాఖ సిబ్బంది మీ ఇంటికే చేరుకొని మీకు నగదు అందజేస్తారు. దీనికోసం మీకు పోస్టాఫీస్ లో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఈ బ్యాంకు అకౌంట్ అయిన పోస్టల్ శాఖ ద్వారా నగదు పొందొచ్చు . మార్చి 24 నుండి ఏప్రిల్ 23 వరకు 21 లక్షల మందికి రూ.412 కోట్ల రూపాయలను పోస్టల్ శాఖ అందజేసింది. ఈ లావాదేవీలన్నీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో, బ్యాంకులు ఏటీఎంలు అందుబాటులో లేని  ప్రాంతాల్లో జరిగాయని పోస్టల్ శాఖ తెలిపింది.