తెలంగాణాలో రానున్న 48 గంటలలో వర్ష సూచన : వెల్లడించిన వాతావరణ శాఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

తెలంగాణాలో రానున్న 48 గంటలలో వర్ష సూచన : వెల్లడించిన వాతావరణ శాఖ

3
తెలంగాణ : సముద్రమట్టానికి 3.6 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. రానున్న 48 గంటల్లో అది బలపడి వాయుగుండంగా మారొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇది గురువారంనుంచి మే 3 మధ్య మయన్మార్‌ తీరం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నదన్నారు. అల్పపీడనం ప్ర భావం తెలంగాణపై ఉండదని ఆయన చెప్పారు. ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రం లోని పలుప్రాంతాల్లో బుధవారం వాన లు కురిశాయి. రాష్ట్రంలోని పలుచోట్ల రెండ్రోజులు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో నాలుగురోజులు వర్షాలు కురువొచ్చన్నారు అధికారులు అంచనా వేస్తున్నారు .