50 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

50 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) :  28 వ డివిజన్ మాజీ కార్పొరేటర్, కూడా డైరెక్టర్ యేలుగం శ్రీనివాస్ ఈ రోజు 50 మంది పేద కుటుంబాలకు బియ్యము కూరగాయలు 8 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్  సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ, కరోనా వ్యాప్తి నిర్మూలన చర్యలు గురించి అవగాహన కల్పిస్తున్నామని, డివిజన్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు  అందజేస్తున్నామని అన్నారు. బీడీ కార్మికులు, ఆటో  కార్మికులు, కూలీలకు, వృద్ధులకు. వితంతువులకు, ఒంటరి మహిళలకు వికలాంగులకు,వీరికి అదేవిధంగా డివిజన్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దశరథం, మంద శోభ, మాటేటి రాములు, అధ్యక్షుడు హరికృష్ణ పటేల్, మురళి ఉపాధ్యక్షుడు నాగరాజు, తదితరులు
పాల్గొన్నారు.