రేపటి నుండే మహిళల ఖాతాల్లోకి రూ.500 - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

రేపటి నుండే మహిళల ఖాతాల్లోకి రూ.500

కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్నతరుణంలో 21రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పేదలు, సామాన్యులతోపాటు ఇతర వర్గాలవారికి ఆపన్నహస్తం అందించింది. ముఖ్యంగా కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ.50 లక్షల జీవితబీమా కల్పిస్తున్నట్టు తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ప్రధాని మోడీ 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన 36 గంటల్లోనే ‘గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ కింద ప్యాకేజీని ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్యాకేజీలో భాగంగా మూడు నెలలపాటు పేదలకు ఉచితంగా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధ్యాన్యాలు, వంట గ్యాస్‌ అందించనున్నట్టు చెప్పారు. వివిధ వర్గాల ప్రజలకు నగదు సాయాన్ని ప్రకటించారు. అయితే లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మూతపడిన కంపెనీలు, సంస్థలను కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుందో మాత్రం ఆర్థిక శాఖా మంత్రి నిర్మల తెలుపలేదు. 

ఈ ప్యాకేజీలో పీఎం ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న 8.3 కోట్ల మంది పేద మహిళలకు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా సిలిండర్లు అందిస్తారు. ఇందుకు రూ.13వేల కోట్లు వ్యయం చేయనున్నారు. దేశంలోని 63 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు తనఖాలేని రుణపరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. తద్వారా ఏడు కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. జన్‌ధన్‌ ఖాతాలున్న మహిళలకు ప్రతినెల నేరుగా రూ.500 చొప్పున జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 20.4 కోట్ల ఖాతాల్లోకి రూ.500 ఒకేసారి జమచేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు రూ.31వేల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. పేద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి రూ.వెయ్యి జమచేస్తామన్నారు.

Post Top Ad