ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుండి వచ్చి నివసిస్తున్నటువంటి 500 మందికి వలస కూలీలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 07, 2020

ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుండి వచ్చి నివసిస్తున్నటువంటి 500 మందికి వలస కూలీలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ......


శుభతెలంగాణన్యూస్(మేడ్చల్ జిల్లా): ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు కె టి ఆర్ గారి సూచనల మేరకు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ లో వివేకానంద నగర్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో  ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుండి  వచ్చి నివసిస్తున్నటువంటి వలస కూలీలకు దాదాపు 500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో పస్తులు ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసిఆర్* గారి సూచనల మేరకు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ లో  దాదాపు 500 మందికి భోజనం ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగిందని అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని లేని వారికీ 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అంతే కాకుండా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో  ఉన్నాయని ఎవరు భయపడవద్దని మనం చేయాల్సింది ఒక్కటే అని ప్రజలు అత్యవసరంమైతే తప్ప బయటకు రాకూడదని 15వ తేదీ వరకు లాక్ డౌన్ పాటించవలసిన బాధ్యత మనందరి మీద వుంది అని ఇది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని నిర్లక్ష్యం వహిస్తే మన ప్రాణాలకే ముప్పు అని దయ చేసి ఎవరి ఇండ్లల్లో వారు స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేయాలనీ ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు గొట్టి ముక్కల భాస్కర్ రావు, బాబు రావు, సురేష్  పెంటమ్మ, రాధ బాయి, సాలయ్య, కృష్ణ సామ్యూల్, వెంకన్న, యూసఫ్, ప్రవీణ్ ,చంద్రయ్య, మధు, ఆనంద్, సంధ్య, నరసింహ, హేమంత్, సోమయ్య, శ్రీనివాస్ రెడ్డి, విద్యా సాగర్, చంద్ర మోహన్ సాగర్, రాంచందర్ రావు,  అసోసియేషన్ సభ్యులు వాసుదేవ రావు, వెంకట్రావు, శ్రీనివాస రావు, కిషోర్ రెడ్డి, నరేంద్ర, బొబ్బిలి శ్రీను, రామ రావు, వెంకటరామ్, శ్రీదేవి, సూర్యకాంతం, సత్య, వెంకటాద్రి వెంకట్ రామ్   తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad