500 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

500 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్


శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) : కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎన్.టి.ఆర్ నగర్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తన సొంత ఖర్చులతో 500 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఎల్లమ్మ బండ కోవిడ్- 19 రెడ్ జోన్ లో ఉన్నందుకు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అందరూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఎన్.టి.ఆర్ నగర్ ప్రజలకు నేను అండగా ఉన్నానని ధైర్యాన్ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో యువనాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, పాండు గౌడ్, వార్డ్ సభ్యులు చిన్నోల్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, ఏరియా కమిటీ మెంబెర్స్ శౌకత్ అలీ మున్నా, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. సహకరిస్తున్న నాయకులకు కార్యక్తలకు దొడ్ల వెంకటేశ్ గౌడ్ అన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.




Post Top Ad