కరోనా బాధితులకు చికిత్స కోసం గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కొవిడ్ ఆస్పత్రికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రూ.50లక్షలు ఇచ్చారు. తన ఎంపీ నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించారు.
ఆస్పత్రికి సివరేజ్ ప్లాంట్ లేక కేంద్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి మురుగునీరు వెళ్లిపోవడంతో విద్యార్థులు ఈ సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రస్తావించారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన రేవంత్.. రూ.50లక్షలు కేటాయిస్తూ మల్కాజ్గిరి కలెక్టర్కు లేఖ ఇచ్చారు.