తెలంగాణాలో లక్డౌన్ అమలు లో ఉన్న ఆగని కరోనా పాజిటివ్ కేసులు : మరో 6 కొత్త కేసులు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

తెలంగాణాలో లక్డౌన్ అమలు లో ఉన్న ఆగని కరోనా పాజిటివ్ కేసులు : మరో 6 కొత్త కేసులు నమోదు

1
తెలంగాణ: తెలంగాణాలో ఆగని కరోనా ఉదృతి  , లక్డౌన్ అమలు మొదలెట్టి నెలలు గడుస్తున్నా కరోనా కేసులు మాత్రం ఆగటం లేదు ,  మంగళవారం కూడా తెలంగాణలో కొత్తగా గుర్తించిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6 కి పరిమితం అవడం కొంత ఊరట కలిగిస్తోంది. అంతేకాకుండా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతుండటం ఇంకొంత ఉపశమనాన్నిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అవి కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనివేనని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1009 చేరుకుంది. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు అలా మొత్తం 374 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 610 యాక్టీవ్ కేసులు ఉండగా... కరోనాతో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.