కరోనా బాధితుల సహాయార్థం రూ.75 వేలు విరాళం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

కరోనా బాధితుల సహాయార్థం రూ.75 వేలు విరాళం..

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే  పిలుపు మేరకు ముందుకొస్తున్న దాతలు..‘కరోనా వైరస్‘ బీభత్సంగా వ్యాపిస్తున్న కారణంగా, కరోనా బాధితుల సహాయార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్ కు చెందిన సాయి రామ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పిలుపు మేరకు ముందుకొచ్చామని, ఈ మేరకు రూ.75 వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో దాతలు ముందుకు రావడం సంతోషకరమని, ఎంతో ప్రమాదకరంగా భావించే . ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ ను పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావద్దని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే ‘కరోనా వైరస్‘ ను అరికట్టవచ్చని అన్నారు.

Post Top Ad