తెలంగాణలో మే 7 తరువాత ఏం జరగనుంది..?.. మరోమారు మే 15 వరకు లాక్ డౌన్ ..? - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

తెలంగాణలో మే 7 తరువాత ఏం జరగనుంది..?.. మరోమారు మే 15 వరకు లాక్ డౌన్ ..?

శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - హైదరాబాద్ ) :  ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. కంటికి  కనిపించని శత్రువు అయిన కరోనా వైరస్ పై యావత్ భూగోళం అంతా పోరాటం చేస్తోంది. కరోనా రక్కసి  విశ్వంపై విరుచుకుపడుతుంది. లక్షలాది మంది ప్రాణాలను  బలితీసుకుంది ఈ మహమ్మారి. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ రాక్షసిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఈ మహమ్మారి ప్రపంచంపై విరుచుకు పడుతుంది. ముఖ్యంగా తెలంగాణాలో కరోనా వైరస్ రోజు రోజుకు తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటి వరకు 27 జిల్లాలపై తన ప్రతాపం చూపింది. ఈ వైరస్ ను మానవ శరీరంలో నుంచి నిర్మూలించే వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మే 7 వరకు ఈ లాక్ డౌన్ ను అమలులో ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో యావత్ భారత్ తీవ్ర నష్టాలపాలైంది. తెలంగాణలో కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రధాని మోడీ మే 3 వరకే లాక్ డౌన్ ని పొడిగించినప్పటికి సీఎం కేసీఆర్ మే 7 వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ తెలంగాణాలో మాత్రం ఎలాంటి సడలింపులు లేని లాక్ డౌన్  కొనసాగుతుంది. 

ప్రధానితో ముఖ్యమంత్రుల మీటింగ్ లో కూడా ముందుగా కేసీఆర్ యే లాక్ డౌన్ ని ఖచ్చితంగా పొడిగించాలని సూచించారు. కేసీఆర్ అన్నట్లుగానే లాక్ డౌన్ పొడగింపు జరిగింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆర్థిక రంగం పూర్తిగా గాడి తప్పింది. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, నిర్మాణ పనులు మూతపడటంతో తీవ్రమైన ప్రభావం చూపింది.
లాక్ డౌన్ కారణంగా రవాణా, రిజిస్టేషన్లు, ఎక్సయిజ్  డిపార్టుమెంటుల నుండి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయింది.