పోలీసులకు భోజనాలు వడ్డించి,క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

పోలీసులకు భోజనాలు వడ్డించి,క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్

శుభ తెలంగాణ, హైదరాబాద్(13,ఏప్రిల్‌,20) : కరోనా వైరుస్ కట్టడిలో భాగంగా నిర్వహిస్తున్న  కర్ఫ్యూలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్  భోజనం ఏర్పాటు చేశారు. ఈ  మేరకు 24గంటలపాటు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సీపీ ఆదివారం బడాఖాన నిర్వహించారు. ఎల్బీనగర్ పనామా దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిబ్బందికి శాఖహారంతో పాటు, మాంసహారంతో తయారు చేసిన భోజనాన్ని మహేశ్ భగవత్ సిబ్బందికి స్వయంగా వడ్డించి,  వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. లౌక్ డౌన్ బందోబస్తు ముగిసేంత వరకు  సిబ్బందికి నాణ్యమైన భోజనం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీలు, వనస్థలిపురం ఏసీపీ జయరాం, ఎల్బీనగర్ ఏసీసీ, సీఐ అశోక్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.               

Post Top Ad