A.P పోలీసుల అత్యుత్సాహం 144 సెక్షన్ పేరుతో ఆర్మీ జవాన్ పై దాడి ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

A.P పోలీసుల అత్యుత్సాహం 144 సెక్షన్ పేరుతో ఆర్మీ జవాన్ పై దాడి ......

 శుభ తెలంగాణ ప్రతినిధి:ఆంధ్రప్రదేశ్  కర్నూల్ జిల్లా దేవనకొండ కు చెందిన ఆర్మీ జవాను లక్ష్మన్న ను అతి దారుణంగా కొట్టిన వైనం  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్ లో విధులునిర్వహిస్తున్న జవాను లక్షమ్మన్న సెలవు లో రావడం జరిగింది , సెలవు అయిపోయి విధులకు వెళ్లాల్సిన లక్ష్మన్న లాక్ డౌన్ వలన వెళ్లలేక పోయాడు . గత శుక్రవారం అనగా ఏప్రిల్ 17 న తన తల్లి ఆరోగ్యం బాగాలేక , అలాగే తనకి కూడా బైక్ సైలెన్సర్ తగిలి గాయమైతే మందుల కోసం మెడికల్ షాప్ కి వెళుతుంటే లాక్ డౌన్ పేరుతొ  దేవనకొండ ఎస్సై మారుతి  మరియు ఇద్దరు కానిస్టేబుల్స్ దూషించడం తో పాటు , రక్తాలు కారేటట్టు కొట్టారు .  నేను ఆర్మీ జవానునని చెప్పిన ... మా అమ్మకి ఆరోగ్యం బాగోలేక మందులకు కోసం వెళుతున్నానని చెప్పినా వినకుండా ఎస్సై మారుతి , కానిస్టేబుల్స్ అశోక్ ,మంజునాథ్ లు తిడుతూ మొఖం మీద  పిడిగుద్దులు  గుద్దారు . నేను ఆర్మీ జవానునని చెప్తుంటే.... నువ్వు ఎవడివైతే మాకేందిరా అంటూ ... ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ స్టేషన్ కి తీసుకెళ్లి అతి దారుణంగా రక్తాలు కారేటట్టు కొట్టారు . కొట్టిన ఎస్సై మారుతి పారిలో ఉన్నాడు .జరిగిన సంఘటన పై అలసత్వం ప్రదర్శిస్తున్న ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవటం గమనించదగ్గ విషయం .. ఇకనైనా రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి జవాన్ పై దాడి చేసిన ఎస్సై మారుతి , కానిస్టేబుల్ అశోక్ , మంజునాథ్ ల పై చట్టపరమైన చెర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు ..
                        చిత్రంలో ఆర్మీ జవాన్ (ఫైల్ )

Post Top Ad