A.P పోలీసుల అత్యుత్సాహం 144 సెక్షన్ పేరుతో ఆర్మీ జవాన్ దాడి ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

A.P పోలీసుల అత్యుత్సాహం 144 సెక్షన్ పేరుతో ఆర్మీ జవాన్ దాడి ......

శుభ తెలంగాణ న్యూస్ (18ఏప్రిల్20)కర్నూల్  జిల్లా దేవనకొండ కు చెందిన ఆర్మీ జవాను లక్ష్మన్న ను అతి దారుణంగా కొట్టిన వైనం  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్ లో విధులునిర్వహిస్తున్న జవాను లక్షమ్మన్న సెలవు లో రావడం జరిగింది , సెలవు అయిపోయి విధులకు వెళ్లాల్సిన లక్ష్మన్న లాక్ డౌన్ వలన వెళ్లలేక పోయాడు . గత శుక్రవారం అనగా ఏప్రిల్ 17 న తన తల్లి ఆరోగ్యం బాగాలేక , అలాగే తనకి కూడా బైక్ సైలెన్సర్ తగిలి గాయమైతే మందుల కోసం మెడికల్ షాప్ కి వెళుతుంటే లాక్ డౌన్ పేరుతొ  దేవనకొండ ఎస్సై మారుతి  మరియు ఇద్దరు కానిస్టేబుల్స్ దూషించడం తో పాటు , రక్తాలు కారేటట్టు కొట్టారు .నేను ఆర్మీ జవానునని చెప్పిన ... మా అమ్మకి ఆరోగ్యం బాగోలేక మందులకు కోసం వెళుతున్నానని చెప్పినా  వినకుండా ఎస్సై మారుతి , కానిస్టేబుల్స్ అశోక్ ,మంజునాథ్ లు తిడుతూ మొఖం మీద  పిడిగుద్దులు  గుద్దారు. నేను ఆర్మీ జవానునని చెప్తుంటే  ... నువ్వు ఎవడివైతే మాకేందిరా అంటూ ... ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ స్టేషన్ కి తీసుకెళ్లి అతి దారుణంగా రక్తాలు కారేటట్టు కొట్టారు . కొట్టిన ఎస్సై మారుతి పారిలో ఉన్నాడు .జరిగిన సంఘటన పై అలసత్వం ప్రదర్శిస్తున్న ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవటం గమనించదగ్గ విషయం .. ఇకనైనా రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి జవాన్ పై దాడి చేసిన ఎస్సై మారుతి , కానిస్టేబుల్ అశోక్ , మంజునాథ్ ల పై చట్టపరమైన చెర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు ..

మరిన్ని చిత్రాలు :


Post Top Ad