ఉప్పల్ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ మహిళా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ముక్తల రేఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

ఉప్పల్ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ మహిళా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ముక్తల రేఖ

తెలంగాణ మహిళా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ముక్తల రేఖ వారి కుటుంబం తరపున మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంజిరెడ్డి సహకారంతో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంత పేద
ప్రజలకు దాదాపు 100 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక మహిళా కార్యకర్త ముక్తల రేఖ మాట్లాడుతూ... కొరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభన వలన పేదవారి పరిస్థితులు దయనీయంగా మారినాయని,అందుకు తమ కుటుంబం తరపున మానవతా దృక్పథంతో 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేయడం బాధ్యతగా ఫీల్ అవుతున్నామని తెలిపారు.

Post Top Ad