ఉగ్ర దాడిలో తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచిన జవాన్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

ఉగ్ర దాడిలో తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచిన జవాన్లుయావత్ ప్రపంచం కరోనాపై పోరులో తలమునకలై ఉన్న తరుణంలోనూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం రక్తదాహంతో తపించిపోతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ పట్టణంలో ఈ దాడి జరిగింది. సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్ 179వ బెటాలియన్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి దిగారు. భద్రతాబలగాలు స్పందించి ఎదురుకాల్పులు జరిపేలోపే సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. వారం వ్యవధిలో జరిగిన మూడో ఉగ్రదాడి ఇది.