అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : ;తెలంగాణ ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : ;తెలంగాణ ప్రభుత్వం

శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - తెలంగాణ ) :  ప్రస్తుతం కరోనా విజృభిస్తున తరుణంలో తల్లితండ్రుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 46ను ఖచ్చితంగా అమలు చేయాలని సరూర్ నగర్ బాలాపూర్  మండలాల విద్యాధికారి గంధం వెంకటయ్య అన్నారు. 2019-20 విద్య సంవత్సరం లో విద్యార్థుల నుండి వసూలు చేసిన ట్యూషన్ ఫీజులను వచ్చే విద్యా సంవత్సరం వసూలు  చేసుకోవాలని ,అది కూడా నెలవారిగా తీసుకోవాలని ప్రవేట్ యాజమాన్యాలు కోరారు.  ఈ ఉత్తరులు రాష్ట్ర సిలబస్ ,సి.బీ.ఎస్.సి, ఐ.సి.ఎస్.ఈ తదితర అన్ని పాఠశాలలకు వర్తిస్తాయి అన్నారు. ఫీజుల విషయం లో ఇబ్బందులు గురి చేస్తే ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు 7729998511 మరియు 949444072 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తరులను ఉలగిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.